సాన్నిహిత్యం
Friday, 18 March 2011
Tuesday, 15 March 2011
పొగడ్తలు
నాకో స్నేహితురాలు ఉంది... ఆమెకు నేనేమి చేసిన గొప్ప విషయం లాగా కనబడుతుంది.. ప్రతి దానికి పొగుడుతుంది.. కానీ అది ఆమెకు పొగడ్తలాగా ఉండదు.. అందుకే ఆమెను నేను భజన సంఘం అని అంటూ ఉంటాను..నిజం చెప్పాలంటే నాకు పొగడ్తలు అస్సలు గిట్టవు.. నాదేదో సూపర్ బ్రెయిన్ అని తను అనుకొంటూ ఉంటుంది....హలో శ్రీకాంతీ (త్) ఇది నీ కోసమే...
Tuesday, 8 March 2011
భీమిలీ బీచ్...
నేను చూసిన మంచి ప్రదేశాల్లో భీమిలి బీచ్ ఒకటి . సాయంకాలం అలా భీమిలి బీచ్ లో చల్ల గాలికి తిరుగుతూ వుంటే చాలా హాయిగా... మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఏమైనా విశాఖ వాసులు చాల అదృష్టవంతులు సుమా. నేను ఇండియా లో చాల ప్రదేశాలు చూశాను..కాని నాకు హైదరాబాద్.. వైజాగ్ చాల బాగా నచ్చాయి ... నేను ఎన్నో బీచ్ లు చూశాను..కాని ఇంత అందమైన బీచ్ ఎక్కడ చూడలేదు...
Wednesday, 2 March 2011
స్నేహం
స్నేహ బంధం ఎంత మధురము...అన్నాడొక సినిమా కవి ...నిజమే సుమా!! సృష్టిలో తీయనిది స్నేహమే కదా ..అది ఇద్దరు వ్యక్తుల (అడ/ మగ ఎవరైనా కావచ్చు ) మధ్య ఉండే అనుబంధం ...ఆ స్నేహం కలకాలం నిలబడాలంటే అది ఆ వ్యక్తుల అభిరుచి మీద ఆధారపడి వుంటుంది .. మామూలుగా మనకు చాలా మంది స్నేహితులు వుంటారు .. కానీ అందరితో మన భావాలను పంచుకోలేము..ఎందుకంటే ఈ రోజుల్లో స్నేహం అనే పదానికి అర్ధం మారిపోయింది.. అంతా స్వార్ధంతో కూడిన స్నేహం..అందుకే మంచి స్నేహితులను ఒకరినో ఇద్దరినో ఎంచుకొంటాం ..కనుక మై డియర్ ఫ్రెండ్స్ స్నేహానికి స్వార్ధాన్ని కలపకండి .. మంచి స్నేహితుల్లా వుండండి...డబ్బుతో నిజమైన స్నేహాన్ని కొనలేము...అల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ ...
Subscribe to:
Posts (Atom)